Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హనీప్రీత్ లా ఉన్న బీహార్ యువతికి అనుకోని తిప్పలు!

  • లగ్జరీ కారులో వెళుతున్న యువతి అరెస్ట్
  • విచారణలో హనీప్రీత్ కాదని వెల్లడి
  • బీహార్ యువతికి నేపాల్ లో తిప్పలు
ప్రస్తుతం నేపాల్ లో తలదాచుకుందని సిట్ అధికారులు భావిస్తున్న గుర్మీత్ రామ్ రహీమ్ ప్రధాన అనుచరురాలు హనీప్రీత్ సింగ్ కోసం అధికారులు ముమ్మరంగా గాలిస్తున్న నేపథ్యంలో, ఆమెలాగే ఉన్న మరో మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని, ఆపై తప్పు తెలుసుకుని వదిలేశారు. నేపాల్ లోని ధరానా వార్డు 13 సమీపంలో ఓ ఇండియన్ నంబర్ ప్లేట్ గల లగ్జరీ వాహనం వెళుతూ అధికారుల కంటబడింది.

 ఆ వాహనంలో అందంగా, హనీప్రీత్ మాదిరిగా ఉన్న ఓ యువతి వెళుతుండగా, వెంటబడి చేజ్ చేసిన అధికారులు ఆమెను పట్టుకున్నారు. ఆపై నిమిషాల్లోనే హనీప్రీత్ అరెస్ట్ అయిందని వార్తలు వచ్చాయి. ఇక ఆమెను ప్రశ్నించిన తరువాత, పోలీసులు వదిలేశారు. ఆమె ఐడెంటిటీని పోలీసులు రహస్యంగా ఉంచినప్పటికీ, బీహార్ లోని పాట్నాకు చెందిన యువతని తెలుస్తోంది. తన కుటుంబంతో కలసి నేపాల్ పర్యటనకు వచ్చిన ఆమె, ఇలా హనీప్రీత్ కోసం వెతుకుతున్న పోలీసుల కంటపడి ఇబ్బందుల పాలైందని సమాచారం.
honeypreet
dera
gurmeet
nepal

More Telugu News