హనీప్రీత్ లా ఉన్న బీహార్ యువతికి అనుకోని తిప్పలు!
- లగ్జరీ కారులో వెళుతున్న యువతి అరెస్ట్
- విచారణలో హనీప్రీత్ కాదని వెల్లడి
- బీహార్ యువతికి నేపాల్ లో తిప్పలు
ఆ వాహనంలో అందంగా, హనీప్రీత్ మాదిరిగా ఉన్న ఓ యువతి వెళుతుండగా, వెంటబడి చేజ్ చేసిన అధికారులు ఆమెను పట్టుకున్నారు. ఆపై నిమిషాల్లోనే హనీప్రీత్ అరెస్ట్ అయిందని వార్తలు వచ్చాయి. ఇక ఆమెను ప్రశ్నించిన తరువాత, పోలీసులు వదిలేశారు. ఆమె ఐడెంటిటీని పోలీసులు రహస్యంగా ఉంచినప్పటికీ, బీహార్ లోని పాట్నాకు చెందిన యువతని తెలుస్తోంది. తన కుటుంబంతో కలసి నేపాల్ పర్యటనకు వచ్చిన ఆమె, ఇలా హనీప్రీత్ కోసం వెతుకుతున్న పోలీసుల కంటపడి ఇబ్బందుల పాలైందని సమాచారం.