Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఉత్తర కొరియాను సర్వ నాశనం చేయగల సామర్థ్యం అమెరికాకు ఉంది: రష్యా

ఐక్యరాజ్యసమితి వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తొలిసారి ప్రసంగిస్తూ.. ప్రపంచానికి ముప్పుగా తయారవుతోన్న ఉత్త‌ర‌కొరియాను అవ‌స‌ర‌మైతే సర్వ‌ నాశ‌నం చేస్తామ‌ని వ్యాఖ్యానించిన విష‌యం తెలిసిందే. దీనిపై రష్యా విదేశాంగశాఖ మంత్రి సెర్గె లావరోవ్‌ స్పందిస్తూ...  ఉత్తర కొరియాపై డొనాల్డ్‌ ట్రంప్ చేస్తోన్న‌ వ్యాఖ్యలను తాము గ‌మ‌నిస్తున్నామ‌ని, ఆ దేశాన్ని బూడిద‌ చేయగల సామర్థ్యం అమెరికాకు ఉందని పేర్కొన్నారు. అందులో త‌మ‌కు ఎలాంటి అనుమానం లేదని తెలిపారు. ప్ర‌పంచ దేశాలు స‌త్సంబంధాలు మెరుగుప‌రుచుకుంటూ పనిచేయాలని అమెరికా అధ్య‌క్షుడు చేసిన వ్యాఖ్యలను మాత్రం రష్యా విదేశాంగశాఖ మంత్రి మెచ్చుకున్నారు.  
america
uno

More Telugu News