ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చిన చంద్రబాబు.. డిసెంబర్ లో ఏపీకి రానున్న బిల్ గేట్స్
- అరగంట ఆలస్యంగా వచ్చినా క్షమిస్తా.. మొత్తానికి ఎగ్గొడితే ఊరుకోను
- నేను కూడా బయోమెట్రిక్ ఉపయోగిస్తున్నా
- ప్రజల్లో ప్రభుత్వం పట్ల సంతృప్తి ఉంది
- మంచి పాలన అందించేందుకు ఉద్యోగులు సహకరించాలి
ప్రభుత్వ పనితీరుపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని చంద్రబాబు తెలిపారు. ఒక్కసారి ప్రభుత్వ ఉద్యోగంలోకి వస్తే 30 ఏళ్లపాటు ఉంటారని... కానీ, తాము మాత్రం ప్రతి ఐదేళ్లకు ఒకసారి ప్రజల్లోకి వెళ్లాల్సి ఉంటుందని, మంచి పాలన అందిస్తేనే మళ్లీ అధికారంలోకి వస్తామని అన్నారు. 2014 ఎన్నికల్లో 1.6 శాతం ఓట్ల తేడాతో టీడీపీ అధికారంలోకి వచ్చిందని, కానీ, ఉప ఎన్నికలో 16 శాతం ఓట్ల తేడాతో గెలిచామని తెలిపారు. మంచి పాలన అందించేందుకు ఉద్యోగులు సహకరించాలని కోరారు.