అత్యంత రహస్యంగా ఉత్తర కొరియా అణుజలాంతర్గామి నిర్మాణం.. సహకరిస్తున్న రెండు దేశాలు!
- శక్తిమంతమైన సబ్ మెరైన్ నిర్మాణం
- సహకరిస్తున్న చైనా, రష్యా
- 2020 నాటికి నిర్మాణం పూర్తి
అణుజలాంతర్గామిని నిర్మించడం చాలా కష్టంతో కూడుకున్న పని అని... అత్యంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని... అయితే ఉత్తర కొరియా మాత్రం దాన్ని చాలా సునాయాసంగా తయారు చేయగలుగుతోందని జపాన్ మీడియా పేర్కొంది. చమురు అవసరం లేకుండానే ఎక్కువ కాలం నీటిలోనే ఉండేలా, దీన్ని రూపొందిస్తున్నారని చెప్పింది. ఇది అత్యంత శక్తిమంతమైన జలాంతర్గామి అని తెలిపింది.