కంచె ఐలయ్యపై ఏపీ సీఐడీ కేసు!
- 'సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు' పుస్తకంపై వైశ్యుల ఆగ్రహం
- ఆర్యవైశ్యుల కేసులన్నీ సీఐడీకి బదిలీ
- పుస్తక నిషేధంపై అధికారుల పరిశీలన
ఈ నేపథ్యంలో, ఈ పుస్తకానికి సంబంధించి ఐలయ్యపై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. ఐలయ్య వ్యవహారశైలి శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉందని సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. మరోవైపు, ఐలయ్యపై నమోదైన కేసులన్నింటినీ, సీఐడీకి బదిలీ చేశారు. పుస్తక నిషేధంపై సాధ్యాసాధ్యాలను అధికారులు పరిశీలిస్తున్నారు. మరోవైపు, తనను చంపుతామంటూ బెదిరింపులు వస్తున్నాయని ఐలయ్య ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.