'మహాభారతం' తీస్తే నాకు ఏ పాత్ర ఇవ్వాలో రాజమౌళికి తెలుసు: ఎన్టీఆర్
- జై పాత్ర చేయడానికి ఎక్కువగా కష్టపడవలసి వచ్చింది
- కష్టానికి తగిన ఆదరణ లభిస్తుందనే నమ్మకం వుంది
- రాజమౌళి 'మహాభారతం' తీస్తే నేను సిద్ధం
- ఈ సినిమా గురించి రాజమౌళి మాట్లాడితేనే బాగుంటుంది
ఇక రాజమౌళి 'మహాభారతం'లో తాను చేసే అవకాశం వున్నట్టుగా వస్తోన్న వార్తల గురించి కూడా ప్రస్తావించారు. రాజమౌళి 'మహాభారతం' తీస్తే .. ఆ సినిమా కోసం తనని సంప్రదిస్తే ఎంత మాత్రం లేట్ చేయకుండా ఓకే చెప్పేస్తానని అన్నారు. చిన్న పాత్రయినా చేయడానికి తాను సిద్ధమనీ, అయితే తనకి ఏ పాత్ర ఇవ్వాలో రాజమౌళికి తెలుసునని చెప్పారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టును గురించిన ప్రచారం మాత్రమే జరుగుతుంది కనుక, ఈ సినిమా గురించి రాజమౌళి మాట్లాడితేనే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.