ఎన్టీఆర్ దృష్టిలో పడిన హరితేజ .. బ్రేక్ ఖాయమంటున్నారు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎన్టీఆర్ దృష్టిలో పడిన హరితేజ .. బ్రేక్ ఖాయమంటున్నారు

  • 'బిగ్ బాస్' హౌస్ లో హరితేజ సందడి 
  •  ఎన్టీఆర్ ను ఆకట్టుకున్న ఆమె టాలెంట్
  •  ఆమెకి బ్రేక్ ఇచ్చే ఆలోచనలో ఎన్టీఆర్
  •  షో తరువాత సినిమాల్లో బిజీ అయ్యే అవకాశం      
'బిగ్ బాస్' కంటెస్టెంట్స్ లో ఒకరుగా హరితేజ వున్న విషయం తెలిసిందే. ఈ షోలో విజేతగా నిలిచే ఛాన్స్ ఆమెకే ఎక్కువగా ఉందనే టాక్ వినిపిస్తోంది. ఈ షోకి రావడానికి ముందు హరితేజ చేసిన చెప్పుకోదగిన సినిమా 'అ ఆ' మాత్రమే. ఆ సినిమానే ఆమెకి కొంత గుర్తింపు తెచ్చిపెట్టింది.

ఇక ఈ షోలో ఆమె సందడి చేసిన తీరు .. మాట తీరు .. వ్యక్తిత్వం ఇవన్నీ కూడా ఎన్టీఆర్ ను ఆకట్టుకున్నాయట. ఆమె టాలెంట్ కి తగిన పాత్రలు ఇస్తే రాణిస్తుందనే భావన ఆయనకి కలిగినట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది. ఈ షో తరువాత ఆమెకి బ్రేక్ ఇచ్చే ఆలోచనలో ఎన్టీఆర్ వున్నాడని అంటున్నారు. తన సినిమాల్లో అవకాశాలు కల్పించడంతో పాటు .. ఇతర సినిమాలకి కూడా రెఫర్ చేయనున్నాడని అంటున్నారు. ఛాన్స్ ఇస్తే తన సత్తాను చాటుకునే సామర్థ్యం హరితేజాకి వుంది కాబట్టి, వరుస అవకాశాలతో ఆమె బిజీ కావడం ఖాయమని చెప్పుకుంటున్నారు.     
ntr

More Telugu News