Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినీరంగంలోకి రావాలనుకునేవారు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి: అనుష్క

  • ఇక్కడ వెలుగుల కోసం ఎంతో కష్టపడాలి
  • ఎప్పుడు తినాలో, ఎప్పుడు నిద్రపోవాలో కూడా తెలియదు
  • ఒక నిర్ణయం తీసుకున్నాక.. దాని అంతు చూడాలి
  • అన్నీ ఆలోచించే ఈ రంగంలోకి వచ్చా
బయట నుంచి చూడ్డానికి సినీ పరిశ్రమ చాలా గ్లామరస్ గా ఉంటుందని, ఇందులో ఉన్నవారంతా ఎంతో హాయిగా ఉన్నట్టు కనిపిస్తుందని, అయితే ఈ వెలుగుల కోసం ఎంతో కష్టం పడాల్సి ఉంటుందని హీరోయిన్ అనుష్క తెలిపింది. షూటింగ్ జరుగుతున్నన్ని రోజులు ఎప్పుడు తింటారో, ఎన్ని గంటలు నిద్రపోతారో కూడా తెలియదని చెప్పింది. మరోవైపు, ఎలాంటి అలసటను ముఖంలో కనిపించకుండా చూసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఈ రంగంలోకి అడుగుపెట్టాలనుకునేవారు ఈ విషయాలను గుర్తుంచుకోవాలని చెప్పింది.

సినీరంగంలో నిలబడాలంటే ఒక ప్రధాన లక్షణం ఉండాలని, తాను దాన్నే నమ్మానని అనుష్క చెప్పింది. జీవితంలో తాను దేన్నీ ప్లాన్ చేసుకోలేదని... అయితే, ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మాత్రం దాని అంతు చూడాలని తెలిపింది. తాను ఎంతో ఆలోచించిన తర్వాతే ఈ ఫీల్డ్ లోకి వచ్చానని చెప్పింది.
tollywood
anushka
anushka suggestion

More Telugu News