కేబీఆర్ పార్కులో కేడీ.. అరెస్టు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కేబీఆర్ పార్కులో కేడీ.. అరెస్టు!

  • కేబీఆర్ పార్కులో చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న దుండగుడు
  • పార్క్ లో వాకింగ్ కు వచ్చే స్థితిమంతులే లక్ష్యం
  • స్నాచ్ చేసి, శాంత్రో కారులో ఉడాయింపు
  •  నిఘా వేసి పట్టుకున్న  పోలీసులు
హైదరాబాదులోని కేబీఆర్ పార్క్ లో కేడీని పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే... జూబ్లీహిల్స్ లోని కేబీఆర్ పార్కుకు చాలా మంది మార్నింగ్, ఈవెనింగ్ వాక్ కి వెళ్తుంటారు. బాగా పాష్ ఏరియాలో ఉండడంతో ఈ పార్క్ కు స్థితిమంతులు వస్తుంటారు. వారిని లక్ష్యం చేసుకున్న దుండగుడు, రోజూ శాంత్రో కారులో పార్కుకి వస్తుంటాడు.

వాకర్ లా వాకింగ్ చేస్తూ..  ఒంటరిగా మహిళలు తారసపడినప్పుడు వారి మెడలో చైన్లు, పుస్తెల తాళ్లు, నల్లపూసలు ఇలా ఏది దొరికితే అది లాక్కుని పారిపోతుంటాడు. కేబీఆర్ పార్క్ లో ఆగంతుకుడిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో అతనిపై నిఘా వేశారు. ఈ క్రమంలో ఈ ఉదయం ఓ మహిళ మెడలోంచి గొలుసు లాక్కుని పారిపోతున్న సమయంలో అతనిని పట్టుకున్నారు. అతని నుంచి చైన్లు, శాంత్రోకారు స్వాధీనం చేసుకున్నారు. అతనిని అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. 
kbr park
chain snatcher
hydrabad

More Telugu News