మెగా హీరో సెట్స్ లో అడుగుపెట్టిన దర్శకేంద్రుడు!
- షూటింగ్ ముగింపు దశలో 'జవాన్'
- సాయిధరమ్ తేజ్ జోడీగా మెహ్రీన్
- షూటింగ్ స్పాట్ కి రాఘవేంద్రరావు
- సరదాగా ఒక షాట్ కి దర్శకత్వం
ఆయన అలా రావడం చాలా అరుదు కావడంతో అంతా ఆశ్చర్యపోయారు. ఆయనకి ఆహ్వానం పలుకుతూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సినిమా విశేషాలను గురించి అడిగి తెలుసుకున్న రాఘవేంద్రరావు .. సరదాగా ఒక షాట్ కి దర్శకత్వం వహించారు. యూనిట్ సభ్యులంతా ఆయనతో ఒక ఫోటో తీసుకుని ముచ్చట తీర్చుకున్నారు. దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాను నవంబర్ లో విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందనే నమ్మకంతో సాయి ధరమ్ తేజ్ వున్నాడు.