రూ. 2000కే ఫీచ‌ర్ ఫోన్‌... స‌న్నాహాలు చేస్తున్న బీఎస్ఎన్ఎల్‌
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రూ. 2000కే ఫీచ‌ర్ ఫోన్‌... స‌న్నాహాలు చేస్తున్న బీఎస్ఎన్ఎల్‌

రిల‌య‌న్స్ జియో మార్కెట్లో జియో ఫీచ‌ర్ ఫోన్ ప్ర‌వేశ‌పెట్టిన నాటి నుంచి టెలికాం మార్కెట్‌లో ఉన్న ఇత‌ర ఆప‌రేట‌ర్లు కూడా ఫీచ‌ర్ ఫోన్ల త‌యారీ ప‌నిలో ప‌డ్డారు. ఇప్ప‌టికే ఎయిర్‌టెల్‌, ఐడియాలు ఫీచ‌ర్‌ఫోన్లను విడుద‌ల‌ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇదే బాట‌లో బీఎస్ఎన్ఎల్ కూడా రూ. 2000కే ఫీచ‌ర్ ఫోన్ విడుద‌ల చేసే ప‌నిలో ప‌డ్డ‌ట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా దీపావ‌ళి పండుగ‌లోగా ఈ ఫీచ‌ర్ ఫోన్‌ను మార్కెట్లోకి విడుద‌ల చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ ఫీచ‌ర్‌ఫోన్ త‌యారీ కోసం మైక్రోమాక్స్‌, లావా వంటి మొబైల్ త‌యారీ కంపెనీల‌ను సంప్ర‌దించిన‌ట్లు తెలుస్తోంది. అయితే ఈ ఫోన్ 4జీ స‌పోర్ట్ చేస్తుందా? లేదా? అనే విష‌యం మాత్రం ఇంకా తెలియ‌రాలేదు.
bsnl
feature phone
jio
micromax
lava

More Telugu News