ఉచితంగా సినిమాలు చూసే సౌక‌ర్యం క‌ల్పించిన వొడాఫోన్‌!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఉచితంగా సినిమాలు చూసే సౌక‌ర్యం క‌ల్పించిన వొడాఫోన్‌!

వొడాఫోన్ రెడ్ పోస్ట్‌పెయిడ్ వినియోగ‌దారుల‌కు సంవ‌త్స‌రం పాటు ఉచితంగా సినిమాలు చూసే అవ‌కాశాన్ని వొడాఫోన్ కంపెనీ క‌ల్పించింది. వొడాఫోన్ ప్లే యాప్ ద్వారా ఈ స‌దుపాయాన్ని వినియోగించుకోవ‌చ్చు. దీంతో పాటు వొడాఫోన్ రెడ్ పోస్ట్‌పెయిడ్ ద్వారా మ‌రికొన్ని స‌దుపాయాల‌ను క‌ల్పిస్తోంది. వీటిలో అన్‌లిమిటెడ్ లోక‌ల్‌, ఎస్టీడీ కాల్స్‌తో పాటు ఏడాది పాటు ఉచిత నెట్‌ఫ్లిక్స్ స‌బ్‌స్క్రిప్ష‌న్ వంటి ఆఫ‌ర్లు ఉన్నాయి.

టెలికాం మార్కెట్లో జియో తాకిడిని త‌ట్టుకోవ‌డానికి గ‌త జ‌న‌వ‌రిలో వొడాఫోన్ ప్ర‌త్యేకంగా 'వొడాఫోన్ రెడ్' అనే పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. అలాగే ప్రీపెయిడ్ వినియోగదారుల‌కు కూడా జియో త‌ర‌హాలో కొన్ని ఆఫ‌ర్ల‌ను ప్ర‌వేశ‌పెట్టేందుకు వొడాఫోన్ యోచిస్తున్న‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికే ఎయిర్‌టెల్‌, బీఎస్ఎన్ఎల్‌, ఐడియా వంటి టెలికాం కంపెనీలు ఈ బాట‌లో ప‌య‌నించిన సంగ‌తి తెలిసిందే.
vodafone
vodafone play
vodafone red
netflix
movies

More Telugu News