వెంకటేశ్ నెక్స్ట్ మూవీ తేజతోనే!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వెంకటేశ్ నెక్స్ట్ మూవీ తేజతోనే!

  • తేజ కథకు వెంకీ గ్రీన్ సిగ్నల్  
  • సురేశ్ ప్రొడక్షన్స్ లో నిర్మాణం 
  •  ఆ తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ తో మరో సినిమా 
  •  అందులో మరో యంగ్ హీరో కూడా 
'గురు' సినిమా సక్సెస్ తరువాత మంచి కథల కోసం వెంకటేశ్ వెయిట్ చేశారు. రాక్ లైన్ వెంకటేశ్ నిర్మాణంలో .. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఆయన ఒక సినిమా చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. కథ కూడా రెడీ అయిపోయింది. ఈ కథకు యంగ్ హీరో కూడా అవసరం కావడంతో, ఆ దిశగా సంప్రదింపులు కొనసాగుతున్నాయి.

ఇదిలా వుండగా, ఈ ప్రాజెక్టు పట్టాలెక్కేలోగా తేజతోను ఒక సినిమా మొదలెట్టేయాలనే ఆలోచనలో వెంకటేశ్ ఉన్నాడనేది తాజా సమాచారం. ఇప్పటికే తేజ వినిపించిన కథ ఓకే అయిపోయిందని అంటున్నారు. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పైనే ఈ సినిమా ఉంటుందని చెబుతున్నారు. ఇటీవల రానాతో తేజ చేసిన 'నేనే రాజు నేనే మంత్రి' హిట్ కావడమే ఈ కాంబినేషన్ సెట్ కావడానికి కారణమని తెలుస్తోంది. ఇక బాలకృష్ణతోను తేజ ఒక సినిమా చేయనున్నట్టు వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే.        
venkatesh

More Telugu News