అందుకే 'సైరా'లో సునీల్ ను తీసుకున్నారట!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అందుకే 'సైరా'లో సునీల్ ను తీసుకున్నారట!

  •  'సైరా నరసింహా రెడ్డి'లో కామెడీకి స్థానం 
  •  అందుకే సునీల్ కి దక్కిన అవకాశం 
  •  ఇక నుంచి ఇతర హీరోల సినిమాల్లోను సునీల్    
కమెడియన్ గా సునీల్ కొట్టేసిన మార్కుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఆయన హీరో అయిన తరువాత కూడా కామెడీ చుట్టూ తిరిగే కథా వస్తువునే ఎంచుకున్నాడు. ఇతర హీరోల సినిమాల్లో కమెడియన్ గా చేయడం మానేశాడు. అయితే ఈ విషయంలో ఆయనకి లాభం కన్నా నష్టమే ఎక్కువ జరిగింది. దాంతో ఒక వైపున హీరోగా .. మరో వైపున ఇతర హీరోల సినిమాల్లో కమెడియన్ గా కనిపించాలని నిర్ణయించుకున్నాడు.

 ఈ నేపథ్యంలోనే తాను 'సైరా' సినిమాలో నటించబోతున్నట్టుగా సునీల్ చెప్పాడు. దాంతో ఈ సినిమాలో కామెడీ కూడా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. 'బాహుబలి' మొదటిభాగంలో కామెడీ లేని వెలితిని, రెండవ భాగంలో 'సుబ్బరాజు' పాత్ర ద్వారా రాజమౌళి భర్తీ చేశాడు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని 'సైరా నరసింహా రెడ్డి' సినిమాలోను కామెడీకి ప్రాధాన్యత ఇచ్చారని తెలుస్తోంది. అందుకే సునీల్ ను తీసుకున్నారని చెప్పుకుంటున్నారు.    
sunil

More Telugu News