Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హనీప్రీత్ తొలి ప్రేమ విఫలం... వెలుగులోకి వచ్చిన 19 ఏళ్ల నాటి ప్రేమకథ!

  • చిన్న వయసులోనే ప్రేమలో పడ్డ హనీప్రీత్
  • అతను దూరం కావడంతో విరహ వేదన
  • కవితల రూపంలో మనసులోని బాధ వ్యక్తం 
  • సోదాల్లో దొరికిన హనీప్రీత్ డైరీ
తన గురువు గుర్మీత్ జైల్లో మగ్గుతుండగా, ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న హనీప్రీత్ సింగ్ గురించిన మరో ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది. 19 సంవత్సరాల క్రితం... అంటే హనీప్రీత్ 16 ఏళ్ల వయసులో ఉన్న సమయంలో ఓ వ్యక్తిని మనస్ఫూర్తిగా ప్రేమించి, తిరిగి అతని ప్రేమను పొందడంలో విఫలమైంది. డేరాలో జరుగుతున్న సోదాల్లో భాగంగా హనీప్రీత్ గదిలో లభించిన ఓ డైరీలో ఇందుకు సంబంధించిన విషయాన్ని ఆమె రాసుకుంది. తన మనసులోని భావాలకు అక్షరరూపాన్ని ఇచ్చింది.

"రాత్రి అవుతోంది. పగలువస్తోంది. కానీ ఈ నిరీక్షణకు అంతం ఎప్పుడు? నిన్ను చూసినప్పుడే ఈ కళ్లల్లో వెలుగు!" అంటూ తన భావోద్వేగాన్ని కవిత రూపంలో రాసుకుంది. ఇంతకీ హనీప్రీత్ లో ప్రేమను రగిల్చి, ఆమెలో నిద్రలేకుండా చేసింది ఎవరన్న ప్రశ్న ఇప్పుడు ఉదయిస్తోంది. అతను ఎవరన్నదీ, ఎలా ఉంటాడన్నదీ తెలియకపోయినా, ఈ డైరీలోని ప్రతి అక్షరమూ చూస్తుంటే, హనీప్రీత్ అతన్ని ఎంతగా ప్రేమించిందన్న విషయం తెలుస్తోంది.

తన చిన్న వయసులో మనసుకు నచ్చిన వాడిని గాఢంగా ప్రేమించి, అది విఫలమైన తరువాత...
"నా మనసు విరిగిపోయింది. ఇప్పుడే అనిపిస్తుంది... నువ్వు పరిచయం కాకుండా ఉంటే బాగుండేదని" అంటూ విరహ కవిత్వాన్నీ హనీప్రీత్ తన డైరీలో రాసుకుంది. డైరీలోని ప్రతీ లైన్ లో మనసారా ప్రేమించి, జీవితం పంచుకోవాలని భావించినవాడి గురించి ప్రస్తావిస్తూనే ఉంది. 'లవ్' అన్న మాటకు ఎన్నో నిర్వచనాలు చెప్పుకుంది.

డేరా నుంచి తను వెళ్తూ వెళ్తూ, 5 వేల సీసీ కెమెరాల ఫుటేజ్ ని ధ్వంసం చేసి, గుర్మీత్ అకృత్యాలకు అదనపు సాక్ష్యాలు లేకుండా చేసిన హనీప్రీత్, తాను పదిలంగా దాచుకున్న డైరీని మాత్రం మరచిపోవడం, అది సోదాలు జరుపుతున్న అధికారుల కళ్లపడటం గమనార్హం. ఆమె ఇప్పుడు ఎక్కడుందన్న విషయం మాత్రం ఎవరికీ తెలియడం లేదు. ఆమె నేపాల్ పారిపోయిందని కొందరు, రాజస్థాన్ లో దాగుందని మరికొందరు భావిస్తున్నారు.
honeypreet
dera
gurmeet

More Telugu News