Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రామ్ గోపాల్ వర్మకు కూతురు వార్నింగ్!

  •  తాను జిమ్ చేస్తోన్న వీడియోను వర్మకి పంపిన కూతురు
  •  దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, సరదాగా కామెంట్ చేసిన వర్మ 
  •  తండ్రి ధోరణి పట్ల కూతురు అసహనం
  •  డిలీట్ చేయమంటూ వార్నింగ్  
రామ్ గోపాల్ వర్మ అప్పుడప్పుడు తన కుటుంబ సభ్యులకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తుంటాడు. చాలాకాలం క్రితం తన తల్లితో దిగిన ఫోటోను ఇటీవల ఆయన పోస్ట్ చేశాడు. ఇక రీసెంట్ గా తన కూతురు రేవతి జిమ్ చేస్తోన్న వీడియోను పోస్ట్ చేశాడు. "నా కూతురు నన్ను కొట్టేందుకు తనంతట తానే ట్రైనింగ్ అవుతోంది' అంటూ కామెంట్ పెట్టాడు.

ఇది చూసిన కూతురు వర్మపై కోపాన్ని ప్రదర్శించిందట. "మీకు పర్సనల్ గా పంపిన వీడియోను సోషల్ మీడియాలో ఎందుకు పోస్ట్ చేశారు?" అంటూ అసహనాన్ని వ్యక్తం చేసిందనీ, వెంటనే ఆ పోస్ట్ ను డిలీట్ చేయకపోతే అమెరికా నుంచి వచ్చి నిజంగానే కొడతానని మెసేజ్ పెట్టిందని వర్మ చెప్పాడు. నా కూతురు నుంచి రక్షించుకునేందుకు కాలేజ్ డేస్ లో నేను చేసిన బ్రూస్ లీ స్టంట్స్ ను గుర్తు చేసుకుంటున్నానని పేర్కొంటూ, అందుకు సంబంధించిన ఫోటోను సరదాగా పోస్ట్ చేశాడు. ఇక ఇప్పుడు రేవతి ఎలా స్పందిస్తుందో చూడాలి.   
ramgopal varma

More Telugu News