ఇలా సెల్ఫీ దిగి... అలా ప్రింట్ చేయొచ్చు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇలా సెల్ఫీ దిగి... అలా ప్రింట్ చేయొచ్చు!

  • మార్కెట్‌లోకి పాకెట్ ఫొటో ప్రింట‌ర్‌
  • విడుద‌ల చేసిన హెచ్‌పీ
  • ధ‌ర రూ. 8,999 మాత్ర‌మే
ఈ త‌రం యువ‌త‌కు సెల్ఫీలపై రోజురోజుకీ మోజు పెరుగుతున్న సంగ‌తి తెలిసిందే. వారి కోసమే ప్ర‌త్యేకంగా ఓ పోర్ట‌బుల్ పాకెట్ ఫొటో ప్రింట‌ర్‌ను హెచ్‌పీ సంస్థ భార‌త మార్కెట్‌లో ప్ర‌వేశ‌పెట్టింది. దీని ధ‌ర రూ. 8,999గా నిర్ణయించింది. దీని ద్వారా స్మార్ట్‌ఫోన్లో ఉన్న ఫొటోల‌ను ఎప్పుడు కావాలంటే అప్పుడు వెంట‌నే ప్రింట్ తీసుకోవ‌చ్చు. అమెరికా, చైనా, ఆస్ట్రేలియా దేశాల్లో ఇది ఎప్ప‌ట్నుంచో అందుబాటులో ఉంది.

`స్ప్రోకెట్‌` అని పిలిచే ఈ పాకెట్ ప్రింట‌ర్ వ‌ల్ల ఫొటోలు ప్రింట్ చేయించుకోవ‌డానికి ప్ర‌త్యేకంగా స్టూడియోల‌కు వెళ్లాల్సిన అవ‌సరం త‌గ్గుతుంద‌ని హెచ్‌పీ ఇండియా సీనియ‌ర్ డైరెక్ట‌ర్ రాజ్ కుమార్ రిషి తెలిపారు. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ స్మార్ట్ ఫోన్ల‌కు ఈ ప్రింట‌ర్‌ను బ్లూటూత్ ద్వారా క‌నెక్ట్ చేసుకోవ‌చ్చు. ప్ర‌త్యేకంగా జింక్ టెక్నాల‌జీతో త‌యారుచేసిన ప్రింటింగ్ పేప‌ర్‌ను ఈ ప్రింట‌ర్‌లో ఉప‌యోగించాలి. ఈ పేప‌ర్ పై 20 కాపీల‌ను రూ. 539కి పొంద‌వ‌చ్చు.
Sprocket
HP
Selfie

More Telugu News