అందుకే రెమ్యునరేషన్ తీసుకోలేదు : రాశి ఖన్నా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అందుకే రెమ్యునరేషన్ తీసుకోలేదు : రాశి ఖన్నా

  •   'రాజా ది గ్రేట్' లో రాశి ఖన్నా స్పెషల్ సాంగ్
  •   పారితోషికంగా భారీ మొత్తమే పుచ్చుకుందనే టాక్
  •   పైసా తీసుకోలేదని చెప్పిన రాశి ఖన్నా
  •  అక్టోబర్ 12న విడుదల  
రవితేజ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'రాజా ది గ్రేట్' సినిమా రూపొందుతోంది. రవితేజ చూపులేని వ్యక్తిగా కనిపించే ఈ సినిమాలో, మెహ్రీన్ కథానాయికగా నటించింది. రాధిక కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమాను అక్టోబర్ 12న విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ను రాశి ఖన్నాపై ఇటీవల చిత్రీకరించారనే వార్త తాజాగా బయటికి వచ్చింది.

 కాజల్ .. తమన్నా .. కేథరిన్ వంటి కథానాయికలు స్పెషల్ సాంగ్ చేస్తే, భారీ మొత్తాన్నే పారితోషికంగా తీసుకుంటున్నారు. దాంతో రాశి ఖన్నాకు ఎంత ముట్టిందోనని అనుకున్నారు. కానీ ఈ స్పెషల్ సాంగ్ కోసం ఆమె పైసా కూడా తీసుకోలేదనేది తాజా సమాచారం. గతంలో తనకి 'సుప్రీమ్'తో హిట్ ఇచ్చిన అనిల్ రావిపూడితో గల స్నేహం కారణంగానే తాను ఏమీ తీసుకోలేదని రాశి ఖన్నా చెప్పింది. ఈ స్పెషల్ సాంగ్ లో సాయిధరమ్ తేజ్ కూడా మెరుస్తాడనే టాక్ వినిపిస్తోంది.     
rasi khanna

More Telugu News