దర్శకుడు తేజకు బాలకృష్ణ నుంచి పిలుపు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దర్శకుడు తేజకు బాలకృష్ణ నుంచి పిలుపు!

  • 'నేనే రాజు నేనే మంత్రి'తో హిట్ కొట్టిన తేజ
  • ఎన్టీఆర్ బయోపిక్ కు దర్శకుడిగా తేజకు చాన్స్!
  • ఇప్పటికే రెండు దఫాలుగా చర్చించిన బాలయ్య
  • అధికారిక ప్రకటన రావడమే తరువాయి
గత కొన్ని సంవత్సరాలుగా వరుస పరాజయాలతో సతమతమై, ఇటీవలే రానా హీరోగా 'నేనే రాజు నేనే మంత్రి' చిత్రంతో హిట్ కొట్టి ఫామ్ లోకి వచ్చేసిన దర్శకుడు తేజకు మరో బంపరాఫర్ లభించిందని తెలుస్తోంది. తన కెరీర్ లో ఎక్కువగా కొత్త వారితో పని చేయాలని భావించే తేజ, ఇప్పుడు టాప్ హీరోలతో చిత్రాలు చేయాలని భావిస్తుండగా, నందమూరి నటసింహం బాలకృష్ణ నుంచి తేజకు పిలుపు వెళ్లినట్టు తెలుస్తోంది.

ఎంతో మంది పెద్ద నిర్మాతలు తేజతో చిత్రం చేసేందుకు క్యూలో ఉండగా, ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తాను తలపెట్టిన చిత్రానికి తేజతో దర్శకత్వం చేయించాలని బాలయ్య భావిస్తున్నట్టు సినీ ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఈ విషయంలో బాలకృష్ణ, తేజల మధ్య చర్చలు కూడా జరిగాయని టాక్ వినిపిస్తోంది. ఈ విషయంలో అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, దాదాపుగా ఎన్టీఆర్ బయోపిక్ కు తేజ దర్శకుడయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.
bala krishna
teja
NTR bio pic

More Telugu News