Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రేమ మత్తులో కొన్ని తప్పులు చేశా: హీరోయిన్ రెజీనా

టాలీవుడ్ లో సక్సెస్ లు సాధించి కూడా, స్టార్ హీరోయిన్ అనే ముద్రకు దూరంగా ఉన్న నటి రెజీనా కాసాండ్రా మాత్రమే. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించినప్పటికీ... ఆమెకు పెద్దగా స్టార్ డమ్ రాలేదు. తనతో పాటే ఎంట్రీ ఇచ్చిన ఇతర హీరోయిన్లు వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నారు. దీనికి గల కారణాలను రెజీనా వెల్లడించింది.

 కెరీర్ ప్రారంభంలోనే ప్రేమలో పడటంతో... తనకు తెలియకుండానే కొన్ని తప్పులు జరిగిపోయాయని తెలిపింది. ఇప్పుడు ఆ మత్తును వదిలించుకున్నానని... ఇకపై ప్రేమ, పెళ్లి అనే ఆలోచనలను వదిలేసి, కెరీర్ పైనే పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తానని చెప్పింది. అయితే, ఎవరి ప్రేమలో పడిందనే విషయాన్ని మాత్రం ఈ అమ్మడు వెల్లడించలేదు. కానీ, ఆమె ప్రియుడు ఎవరన్న విషయం అందరికీ తెలిసిందేనని కొందరు అంటున్నారు.
regina
regina kassandra
tollywood
regina love

More Telugu News