అల్లు అర్జున్ అదే దూకుడు చూపిస్తున్నాడు
- రెండవ షెడ్యూల్ లో 'నా పేరు శివ'
- బన్నీ, అనూ ఇమ్మాన్యుయేల్ పై సీన్స్
- వారాంతాల్లో ముంబైలో మ్యూజిక్ సిటింగ్స్
- ఏప్రిల్ 27న విడుదల
ఒకసారి సెట్స్ పైకి వెళితే ఇక షెడ్యూల్స్ మధ్య పెద్ద గ్యాప్ రాకుండా అల్లు అర్జున్ చూసుకుంటూ ఉంటాడు. ఆ స్పీడ్ వల్లనే ఆయన సినిమాలు అనుకున్న సమయానికి ముందుగానే రెడీ అవుతుంటాయి. అలా ఒక వైపున చకచకా షూటింగును కొనసాగిస్తూనే, వీకెండ్ లో ముంబైలో మ్యూజిక్ సిటింగ్స్ జరుపుతున్నారు. బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్ - శేఖర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. ఏప్రిల్ 27న ఈ సినిమాను విడుదల చేయనున్నారు.