రాజమౌళి దర్శకత్వంలో 'మహాభారతం' తప్పకుండా ఉంటుంది!
అలా ఆయన తాజా చిత్రంగా రూపొందిన 'శ్రీవల్లి' .. ఈ నెల 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉండగా 'మహాభారతం' ప్రస్తావన వచ్చింది. అప్పుడాయన స్పందిస్తూ రాజమౌళి 'మహాభారతం' తీస్తాడని తాను ఇంతకు ముందు ఎక్కడా చెప్పలేదనీ, అయితే ఆయన తప్పకుండా తీసే అవకాశం ఉందని అన్నారు. రాజమౌళికి యుద్ధాలు అంటే ఎంతో ఇష్టమనీ, వాటికోసమైనా ఆయన 'మహాభారతం' తెరకెక్కించవచ్చని చెప్పారు.