దుమ్మురేపేస్తోన్న 'జై లవకుశ' ట్రైలర్
ఈ మూడు పాత్రల స్వరూప స్వభావాలకు అద్దం పడుతూ ఈ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే 2.8 మిలియన్ల వ్యూస్ ను దక్కించుకున్న ఈ ట్రైలర్, 1.4 లక్షల లైక్స్ ను సొంతం చేసుకుంది. ఇక ఆడియోకి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. దీనిని బట్టి ఈ సినిమా ఒక రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకోవచ్చనే టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ ఖాతాలోకి మరో బ్లాక్ బస్టర్ హిట్ చేరడం ఖాయమనేది ఆయన అభిమానుల మాట.