: వ్యవసాయ కళాశాల విద్యార్థులకు శుభవార్త.. జీవో నెం. 64 రద్దు.. పవన్ కల్యాణ్ హర్షం!


త‌మ పాలిట శాపంగా మారిందంటూ వ్య‌వ‌సాయ క‌ళాశాల‌ విద్యార్థులు జీవో నెంబ‌రు 64పై నిర‌స‌న తెలిపిన విష‌యం తెలిసిందే. ఈ మ‌ధ్యే వారు సినీన‌టుడు, జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ని కూడా క‌లిసి త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకున్నారు. ఈ జీవోపై పున‌రాలోచించిన‌ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం జీవో నెంబ‌ర్ 64ను ర‌ద్దు చేసింది. దీనిపై స్పందించిన ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా హ‌ర్షం వ్య‌క్తం చేశారు. జీవో నెంబ‌రు 64ను ర‌ద్దు చేసినందుకు సీఎం చంద్ర‌బాబు, వ్య‌వ‌సాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డికి ప‌వ‌న్ కృత‌జ్ఙ‌త‌లు తెలిపారు. అలాగే, వ్య‌వ‌సాయ క‌ళాశాల విద్యార్థులు రైతులకు సేవ చేయ‌డం ప‌ట్ల పూర్తి దృష్టి పెట్టాల‌ని ప‌వ‌న్ పిలుపునిచ్చారు.



  

  • Loading...

More Telugu News