బన్నీ షూటింగులో జాయినైన స్టార్ కమెడియన్!
బన్నీ .. వెన్నెల కిషోర్ కాంబినేషన్లోని కొన్ని సన్నివేశాలను తెరకెక్కించనున్నారట. ఈ ఇద్దరూ కలిసి తెరపై నవ్వుల పువ్వులు పూయించనున్నారన్న మాట. ఈ సినిమాలో బన్నీ కొత్త లుక్ తో .. మరింత ఫిట్ నెస్ తో కనిపించనున్నాడు. ఆయన సరసన కథానాయికగా అనూ ఇమ్మాన్యుయేల్ నటిస్తోంది. ఈ సినిమా ఆమె కెరియర్ కి బాగా హెల్ప్ అవుతుందని అంటున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 27వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.