అభిమానానికి నిలువెత్తు నిదర్శనంగా పవన్ 'పోస్టల్ స్టాంప్'

టాలీవుడ్ అగ్రకథానాయకులలో పవన్ కల్యాణ్ కంటూ ఒక ప్రత్యేకత వుంది. ఆయన సినిమా వస్తుందని అంటేనే ఒక పండుగ వస్తుందన్నట్టుగా అభిమానులు సంబరాలు జరుపుతుంటారు. అలాంటిది ఇప్పుడు వచ్చేది పవన్ 25వ సినిమా అయితే ఊరుకుంటారా? పవన్ కెరియర్లో సంఖ్యా పరంగా ఈ సినిమా ప్రత్యేకతను సంతరించుకోవడంతో, అభిమానులంతా కలిసి తాము కూడా ప్రత్యేకంగా ఏదైనా చేయాలనుకున్నారు.

 ఫలితంగా పవన్ పోస్టల్ స్టాంప్ బయటికి వచ్చింది. పవన్ అభిమానులంతా కలిసి ఆయన పోస్టల్ స్టాంప్ ను నిన్న విజయవాడలో రిలీజ్ చేశారు. 'జనసేన' పార్టీ ఆవిర్భావ సభలో పవన్ పిడికిలి బిగించి ఆవేశంగా మాట్లాడుతున్నప్పటి స్టిల్ ను పోస్టల్ స్టాంప్ గా రిలీజ్ చేశారు. పవన్ పట్ల తమకి గల అభిమానాన్ని ఇలా చాటుకున్నారు. పవన్ చేస్తోన్న ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. 
Go Back to Shorts
pavan kalyan

More Telugu News