Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మైదానంలో తిట్టుకుంటుంటే అదో ఆనందంలే!: వీరేంద్ర సెహ్వాగ్

సమకాలీన క్రికెట్ ప్రపంచంలో ఫైర్ బ్రాండ్ గా అభివర్ణించే విరాట్ కోహ్లీ దూకుడు వైఖరిని కొంతమంది విమర్శిస్తుంటే, మరికొందరు మాత్రం వెనకేసుకొస్తున్నారు. విరాట్ దూకుడుపై తాజాగా స్పందించిన సెహ్వాగ్, ఆయన కెప్టెన్సీ ఎంతో బాగుంటుందని, మైదానంలో తన మనసులోని భావాలను వ్యక్తం చేయడంలో కోహ్లీ ఏ మాత్రమూ సంకోచించడని అన్నాడు. మైదానంలో ప్రత్యర్థి ఆటగాళ్లను తిట్టి వారి ఏకాగ్రతను చెడగొట్టడం వ్యూహంలో ఓ భాగమేనని, అలా తిట్టుకుంటుంటే అదో ఆనందమని అన్నాడు.

తన 14 సంవత్సరాల కెరీర్ లో ఎన్నో మార్లు విదేశీ ఆటగాళ్లతో తిట్లకు గురైన సెహ్వాగ్, అందులో చాలా ఫన్ ఉంటుందని, అయితే, పరిధులు దాటని స్లెడ్జింగ్ కే తాను పరిమితమని చెప్పాడు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు, చిన్న చిన్న తిట్లూ లేకుంటే ఆటలో మజా ఉండదని ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. త్వరలో జరిగే ఇండియా - ఆస్ట్రేలియా సిరీస్ లో స్లెడ్జింగ్ ఓ భాగం కానుందని, రెండు దేశాల కెప్టెన్లు కోహ్లీ, స్టీవ్ స్మిత్ లు గతంలో ఎన్నోమార్లు తిట్టుకున్నారని గుర్తు చేశాడు.

More Telugu News