'శ్రీమంతుడు' సినిమా చాలా ఇష్టం... 70 సార్లు చూశాను: ఏపీ డీజీపీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'శ్రీమంతుడు' సినిమా చాలా ఇష్టం... 70 సార్లు చూశాను: ఏపీ డీజీపీ

మహేష్ బాబు హీరోగా నటించిన 'శ్రీమంతుడు' చిత్రం తనకెంతో నచ్చిందని ఏపీ డీజీపీ సాంబశివరావు వ్యాఖ్యానించారు. ఆ సినిమాను తాను 70 సార్లు చూసివుంటానని చెప్పారు. చివర్లో జగపతిబాబు చెప్పే ఓ డైలాగును ఆయన తన నోటి నుంచి చెప్పి అక్కడున్న అందరితో చప్పట్లు కొట్టించారు. "అందరూ వాడు పుట్టాడ్రా, వీడు పుట్టాడ్రా అంటారుగానీ, మంచోడు పుట్టాడ్రా నాకు" అన్న డైలాగ్ ను చెప్పారు.

 గుంటూరులో శ్రీకృష్ణదేవరాయ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో పోలీసు కుటుంబాల విద్యార్థులకు డీజీపీ ఉపకార వేతనాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, విద్యార్థులు తమను తాము దిద్దుకోవాలని పిలుపునిచ్చారు. మత్తుకు తమ పిల్లలు బానిసలు కావడం పట్ల వారి తల్లిదండ్రుల ప్రమేయం కూడా ఉంటుందని అన్నారు. పోలీసులు సాధారణంగానే కఠినంగా ఉంటారని, వారి విధి నిర్వహణా బాధ్యతలు అటువంటివని చెప్పారు. పోలీసులు తమ పిల్లల్ని మిగతావారికన్నా అత్యుత్తమంగా పెంచాలని పిలుపునిచ్చారు.

More Telugu News