చంద్రబాబును కలిసిన పీవీ సింధు.. సంపూర్ణ సహకారం అందిస్తామన్న సీఎం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చంద్రబాబును కలిసిన పీవీ సింధు.. సంపూర్ణ సహకారం అందిస్తామన్న సీఎం!

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో రజత పతకం సాధించిన పీవీ సింధు తన కోచ్ పుల్లెల గోపీచంద్ తో ఏపీ సీఎం చంద్రబాబును కలిసింది. ఈ సందర్భంగా తాను సాధించిన పతకాన్ని ఆయనకు చూపించింది. సింధును అభినందించిన చంద్రబాబు, ప్రభుత్వం తరపున సంపూర్ణ సహకారం అందిస్తామని అన్నారు. ఈ సందర్భంగా అమరావతిలో బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటుపై గోపీచంద్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏడాదిలోగా ఈ అకాడమీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు.

More Telugu News