మహారాష్ట్ర మంత్రి మానవత్వం.. వరదల్లో చిక్కుకున్న వారిని తన ఇంటికి పిలిచిన మంత్రి!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మహారాష్ట్ర మంత్రి మానవత్వం.. వరదల్లో చిక్కుకున్న వారిని తన ఇంటికి పిలిచిన మంత్రి!

ముంబైలో కురిసిన భారీ వర్షాల కారణంగా రహదారులపై వరద నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో మహారాష్ట్ర మంత్రి గిరీశ్ బపత్ తన మానవత్వం చాటుకున్నారు. తన నివాసానికి పరిసరాల్లో ఉన్న ఫోర్ట్, మంత్రాలయ దగ్గర చిక్కుకుపోయిన ప్రజలను తన ఇంటికి వచ్చి సేద తీరాల్సిందిగా కోరారు. ఈ మేరకు గిరీశ్ తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా ప్రజలకు విన్నవించుకున్నారు. కాగా, ముంబైలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. రవాణా వ్యవస్థ స్తంభించడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. అయితే, పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందని సంబంధిత అధికారులు చెబుతున్నారు.

More Telugu News