అభిమానిపై 'బేవకూఫ్' అంటూ మండిపడ్డ జయాబచ్చన్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అభిమానిపై 'బేవకూఫ్' అంటూ మండిపడ్డ జయాబచ్చన్!

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ సతీమణి జయాబచ్చన్ తన దుందుడుకు స్వభావంతో తరచుగా వార్తల్లో నిలవడం సాధారణ విషయమే. తాజాగా ఆమె మరోసారి నోరు జారారు. ముంబైలోని మహా గణపతిని దర్శించుకునేందుకు ఆమె ఓ ఆలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆమెతో సెల్ఫీ దిగేందుకు ఓ అభిమాని యత్నించాడు. దీంతో, ఇబ్బందికి గురైన జయ... కొన్ని క్షణాలపాటు అతనిపై కోపంగా చూశారు. ఆ తర్వాత 'అలా చేయకు.. బేవకూఫ్ (బుద్ధి తక్కువ వాడు)' అంటూ ఘాటుగా మందలించారు. గతంలో కూడా ఒక ఆలయంలో జయ ఇదే విధంగా ప్రవర్తించారు. అప్పుడు ఆమెతో సెల్ఫీ దిగేందుకు ఓ పూజారి ప్రయత్నించాడు. దీంతో జయ, 'సెల్ఫీ కాదు... పూజపై దృష్టి పెట్టండి' అని చెప్పారు. 

More Telugu News