పొలాచ్చి యాక్షన్ సీన్స్ లో పూజా హెగ్డే!
15 రోజుల పాటు ఇక్కడ యాక్షన్ సీన్స్ నే చిత్రీకరించనున్నారు. పీటర్ హెయిన్స్ అధ్వర్యంలో ఈ పోరాట సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఆ తరువాత షెడ్యూల్ ను హైదరాబాద్ లోనే ప్లాన్ చేశారట. 'జయ జానకి నాయక' హిట్ తరువాత బెల్లంకొండ శ్రీనివాస్ .. 'దువ్వాడ జగన్నాథం' సక్సెస్ తరువాత పూజా హెగ్డే చేస్తోన్న సినిమా ఇది. ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందుతోన్న ఈ సినిమా కూడా హిట్ కొడుతుందేమో చూడాలి మరి.