Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పోర్న్ స్టార్ మియా కలీఫా తల నరుకుతాం: ఐఎస్ఐఎస్ హెచ్చరిక

మాజీ పోర్ట్ స్టార్, లెబనీస్ - అమెరికన్ నటి మియా కలీఫా తల నరుకుతామని ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ హెచ్చరించింది. ఉగ్రవాద సంస్థ నుంచి తనకు హెచ్చరికలు అందాయని, తన సోషల్ మీడియా ఖాతాలో ఐఎస్ఐఎస్ ఎంతో భయంకరమైన హత్యా దృశ్యాలను పోస్ట్ చేసి తనను భయాందోళనలకు గురి చేస్తోందని కలీఫా స్వయంగా పేర్కొంది. వాళ్లు తనను చంపేసేందుకు చూస్తున్నారని, అయినంత మాత్రాన తాను భయపడేది లేదని చెప్పుకొచ్చింది.

 తన తలను నరుకుతున్నట్టు మార్ఫింగ్ ఫొటోలను పెట్టి, తన గతి అదేనని కూడా ఉగ్ర సంస్థ హెచ్చరికలు జారీ చేసినట్టు తెలిపింది. కాగా, తన అడల్ట్ చిత్రాలతో ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులను మియా సంపాదించుకున్న సంగతి తెలిసిందే. మధ్య ప్రాచ్య దేశాలకు చెందిన ఎంతో మంది మత పెద్దలు అమెను విమర్శిస్తూ, పలు ఫత్వాలు జారీ చేశారు కూడా. కిమ్ కర్దాషియన్, సోఫియాలు తనకు రోల్ మోడల్స్ అని చెప్పుకునే మియా కలీఫా ఈ బెదరింపులకు తలొగ్గేది లేదని తేల్చి చెబుతోంది.

More Telugu News