యాక్టింగ్ అవకాశాల కోసం బోల్డ్ ఫొటోలు పోస్ట్ చేస్తున్న మాన్యత... తీవ్ర అసంతృప్తిలో సంజయ్ దత్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

యాక్టింగ్ అవకాశాల కోసం బోల్డ్ ఫొటోలు పోస్ట్ చేస్తున్న మాన్యత... తీవ్ర అసంతృప్తిలో సంజయ్ దత్

నటిగా అవకాశాలు రావాలన్న ఉద్దేశంతోనే తన భార్య మాన్యత సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలు అప్ లోడ్ చేస్తున్నదన్న ఆలోచనతో సంజయ్ దత్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో మాన్యత, తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో స్విమ్ సూట్ ధరించిన ఫొటోలతో పాటు కురచ దుస్తులు ధరించిన ఫొటోలను, మోడలింగ్ ఫొటోలను వరుసగా అప్ లోడ్ చేస్తోంది. ఇక సినిమా ఛాన్స్ ల కోసమే ఆమె ఇలా చేస్తోందని సామాజిక మాధ్యమాల్లో స్పందనలు వస్తుండగా, వాటిని చూస్తున్న సంజయ్, తన అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు సమాచారం.

గతంలో నటిగా రాణించిన మాన్యత, సంజయ్ కి దగ్గరైన తరువాత పరిశ్రమకు కాస్తంత దూరమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు తిరిగి సినీ నిర్మాతలను ఆకర్షించాలని భావిస్తోంది. కాగా, తన కుటుంబంలోని మహిళలు యాక్టింగ్ ప్రొఫెషన్ లోకి వెళ్లేందుకు సంజయ్ ఎంతమాత్రమూ అంగీకరించరన్నది అందరికీ తెలిసిన సత్యం. ఈ విషయం సంజయ్ నోట ఎన్నో మార్లు వచ్చింది కూడా. తన కుమార్తె త్రిషాల నటిగా మారతానంటే, కాళ్లు విరగ్గొడతానని కూడా సంజయ్ వ్యాఖ్యానించాడు. ఇప్పుడు తాజాగా, బోల్డ్ ఫొటోలు పోస్ట్ చేయవద్దని తన భార్యకు వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం.

More Telugu News