హనీప్రీత్ కాదు, విపాసన కాదు... కుమారుడినే వారసుడిని చేసిన గుర్మీత్... డేరా అధినేత ఇక జస్మీత్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హనీప్రీత్ కాదు, విపాసన కాదు... కుమారుడినే వారసుడిని చేసిన గుర్మీత్... డేరా అధినేత ఇక జస్మీత్!

డేరా సచ్చా సౌధా కొత్త అధినేతగా గుర్మీత్ రామ్ రహీమ్ కుమారుడు జస్మీత్ ఇన్సాన్ ను నియమించారు. గత సంప్రదాయాలకు భిన్నంగా ప్రస్తుత చీఫ్ తన వారసుడికే పగ్గాలు అప్పగించడం గమనార్హం. రేప్ కేసులో 20 సంవత్సరాల జైలు శిక్షను అనుభవించాల్సిన గుర్మీత్, డేరా బాధ్యతలను దత్త పుత్రికగా పేర్కొంటున్న హనీ ప్రీత్ లేదా డేరాకు చైర్ పర్సన్ గా ఉన్న విపాసన ఇన్సాన్ లలో ఒకరికి అప్పగించవచ్చని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

అయితే, అనూహ్యంగా తన కుమారుడు జస్మీత్ నే గుర్మీత్ వారసుడిగా ఎంచుకున్నారు. కాగా, జస్మీత్ పంజాబ్ మాజీ ఎమ్మెల్సీ హర్మీందర్ సింగ్ కుమార్తెను వివాహం చేసుకున్నాడు. వాస్తవానికి తనపై సీబీఐ చార్జ్ షీట్ ను దాఖలు చేసినప్పుడే శిక్ష తప్పదని భావించిన ఆయన, జస్మీత్ నే వారసుడిగా చేయనున్నట్టు తన అనుచురుల వద్ద ప్రకటించినట్టు తెలుస్తోంది.

More Telugu News