Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

‘అర్జున్ రెడ్డి’ సినిమాను ఆకాశానికెత్తేసిన దర్శకధీరుడు రాజమౌళి

విజ‌య్ దేవ‌రకొండ హీరోగా ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి తెర‌కెక్కించిన అర్జున్ రెడ్డి సినిమాపై టాలీవుడ్ ప్ర‌ముఖులు ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు. తాజాగా ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా ఈ సినిమాపై స్పందిస్తూ... తాను ఈ రోజు అర్జున్ రెడ్డి సినిమాను చూశాన‌ని చెప్పారు. విజ‌య్ దేవ‌ర కొండ న‌ట‌న అద్భుత‌మ‌ని, ఆయ‌న న‌ట‌న‌లో జీవించాడ‌ని పేర్కొన్నారు.  హీరోయిన్ షాలినితో పాటు ఈ సినిమాలో న‌టించిన ఇత‌రులు కూడా చాలా నేచుర‌ల్‌గా న‌టించార‌ని కొనియాడారు.  బ్లాక్ బ‌స్ట‌ర్ స‌క్సెస్ సాధించినందుకు ఈ సినిమా టీమ్‌కి అభినంద‌న‌లు తెలుపుతున్న‌ట్లు పేర్కొన్నారు. ఈ సినిమాలోని డైలాగులు అద్భుతంగా ఉన్నాయ‌ని, ఈ సినిమాను డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి అద్భుతంగా తెర‌కెక్కించార‌ని అన్నారు.

More Telugu News