నెక్ట్స్ ఏంటా?... ముందు మావయ్య, ఆపై తాతయ్య!: నాగార్జున
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నెక్ట్స్ ఏంటా?... ముందు మావయ్య, ఆపై తాతయ్య!: నాగార్జున

ఇప్పటికే నటుడిగా, నిర్మాతగా, ఓ స్టూడియో యజమానిగా, భర్తగా, తండ్రిగా తన జీవితాన్ని అనుభవిస్తున్న హ్యాడ్ సమ్ హీరో నాగార్జున, నేడు పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలో మావయ్య కాబోతున్నారు కదా? ఆ తరువాత ఏంటి? అన్న ప్రశ్నకు, 'ముందు మావయ్య, ఆపై తాతయ్య... అంతేనా?' అంటూ నవ్వుతూ బదులిచ్చారు.

త్వరలో చైతూ పెళ్లి జరగనుందని, అఖిల్ హీరోగా నటిస్తున్న 'హలో' బాగా వస్తోందని, తాను నటించిన 'రాజు గారి గది-2' కూడా హిట్ అవుతుందని అనుకుంటున్నామని ఈ కారణాలతో ఇంట్లోని ప్రతి ఒక్కరమూ హ్యాపీగా ఉన్నామని అన్నారు. హారర్ సినిమాలను షూట్ చేస్తున్నప్పుడు తనకు భయమేమీ అనిపించదని, సినిమాలు చూసేటప్పుడు మాత్రం ఇప్పటికీ కొన్నిసార్లు రెండు చెవులూ మూసుకుని చూస్తుంటానని చెప్పాడు. సినిమాలో తాను చేసిన కామెడీ తక్కువే అయినా, ఇది అందరినీ అలరిస్తుందని చెప్పారు. తదుపరి తాను ఏ చిత్రం చేయాలన్న విషయాన్ని ఇంకా ఆలోచించుకోలేదని నాగార్జున చెప్పారు.

More Telugu News