Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'నైట్‌రైడర్స్' తరపున బరిలోకి క్రిస్‌గేల్.. షారూఖ్ జట్టులో విధ్వంసకర ఆటగాడు!

విండీస్ క్రికెటర్ క్రిస్‌గేల్ నైట్‌రైడర్స్ తరపున బరిలోకి దిగనున్నాడు. అయితే ఇక్కడో చిన్న విషయం చెప్పాలి. ఆయన ఆడబోతున్నది కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు కాదు.. కేప్‌టౌన్ నైట్‌రైడర్స్‌కు. దక్షిణాఫ్రికా క్రికెట్ అసోసియేషన్ ఈ ఏడాది టీ20 గ్లోబల్ లీగ్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా కేప్‌టౌన్ నైట్‌రైడర్స్ ఫ్రాంచైజీని బాలీవుడ్ సూపర్‌స్టార్ షారూఖ్ ఖాన్ కొనుగోలు చేశాడు. ఈ జట్టులో విండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్‌గేల్, డుమినీ సహా పలువురు స్టార్ క్రికెటర్లు ఉన్నారు. నవంబరు 3న ప్రారంభమయ్యే టీ20 గ్లోబల్ లీగ్ డిసెంబరు 16న ముగుస్తుంది.

More Telugu News