విజయ్ దేవరకొండ జోరు మాములుగా లేదు!
విజయ్ దేవరకొండ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'అర్జున్ రెడ్డి' .. వసూళ్ల పరంగా దుమ్ము రేపేస్తోంది. యూత్ కి ఈ సినిమా ఒక రేంజ్ లో కనెక్ట్ కావడంతో, ఆయన క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. ఈ సినిమా చూసిన వర్మ .. టాలీవుడ్ అమితాబ్ ఆయనేనని కితాబునిచ్చిన సంగతి తెలిసిందే. యూత్ లో పవన్ కి విపరీతమైన ఫాలోయింగ్ వుందనీ, ఆయన తరువాత ప్లేస్ ను విజయ్ దేవరకొండ ఆక్రమించే ఛాన్స్ ఉందంటూ మరికొంతమంది అంటున్నారు.
రెండో హిట్ కే విజయ్ దేవరకొండను ఈ స్థాయిలో పొగిడేయడం కరెక్ట్ కాదనేది మరికొందరి అభిప్రాయం. నాని .. శర్వానంద్ ల మాదిరిగా విజయ్ దేవరకొండ నిలకడగా ముందుకు వెళ్లవలసి ఉంటుందనీ, నటుడిగా తనని తాను నిరూపించుకునే పాత్రలు మరికొన్ని చేయవలసి ఉంటుందని అంటున్నారు. అలా నటన పరంగా .. సక్సెస్ ల పరంగా ఆయన తన మార్కెట్ పెంచుకోవాల్సి ఉందని చెబుతున్నారు. ఈ సమయంలో ఆయన పొగడ్తలకి పొంగిపోకుండా నిచ్చెనను నెమ్మదిగా ఎక్కడమే మంచిదనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.