కర్నూలు జిల్లాలో టీడీపీ శ్రేణుల సంబరాలు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కర్నూలు జిల్లాలో టీడీపీ శ్రేణుల సంబరాలు!

నంద్యాల ఉపఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి ఘన విజయం సాధించడంతో టీడీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. కర్నూలు జిల్లా టీడీపీ కార్యాలయంలో కార్యకర్తలు బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ, నంద్యాల ఉపఎన్నిక విజయం ప్రజలేదనని, నంద్యాల ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టారని అన్నారు. ఈ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే నంద్యాలలో జగన్ తిష్టవేసి మరీ ప్రచారం చేశారని, అయినప్పటికీ ఆయన ఓడిపోయారని అన్నారు.

More Telugu News