Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జగనన్నకు, భారతి వదినకు పెళ్లి రోజు శుభాకాంక్షలు: వైసీపీ ఎమ్మెల్యే రోజా

వైసీపీ అధినేత జగన్, ఆయన భార్య భారతి ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న సందర్భంగా వారికి  ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు రోజా తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది. ‘ఈ రోజు శుభ వివాహ దినోత్సవం సందర్భంగా జననేత జగనన్నకు మరియు భారతి వదినమ్మకు హృదయ పూర్వక పెళ్లి రోజు శుభాకాంక్షలు’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జగన్, తన భార్య భారతి, ఇద్దరు పిల్లలు ఉన్న ఫొటోను రోజా పోస్ట్ చేశారు. కాగా, అంతకుముందు చేసిన పోస్ట్ లో రోజా తన ఇంట్లోని దేవుడి గదిలో పూజ చేస్తూ దిగిన ఫొటోను పోస్ట్ చేశారు.

More Telugu News