Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దెయ్యం కంటెంట్ కు తిరుగులేదంతే .. భారీ రేటుకు 'ఆనందో బ్రహ్మ' శాటిలైట్ హక్కులు

దెయ్యం సినిమా అనగానే అందరిలో ఒక రకమైన ఆసక్తి మొదలవుతుంది. భయం అంటూనే చాలామంది చూసేస్తుంటారు .. అదో థ్రిల్ .. అంతే. ఈ కారణంగానే దెయ్యం సినిమాలు చాలా వరకూ సక్సెస్ ను సాధిస్తూ ఉంటాయి. తాజాగా ఆ జాబితాలో 'ఆనందో బ్రహ్మ' చేరిపోయింది. కేవలం 3 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా, తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను దూసుకుపోతోంది.

ఈ సినిమా శాటిలైట్ హక్కులను జీ తెలుగు వారు 3. 25 కోట్లకి కొనుగోలు చేసినట్టు చెబుతున్నారు. పెట్టిన పెట్టుబడి శాటిలైట్ రూపంలో తిరిగి వచ్చేయడం విశేషం. లాంగ్ రన్ లో ఈ సినిమా 10 కోట్ల షేర్ ను రాబట్టవచ్చనీ, ఇప్పటికే నిర్మాతలకి 5 కోట్ల వరకూ లాభాలు వచ్చేశాయని అంటున్నారు. ఈ మధ్య కాలంలో చిన్న సినిమాగా వచ్చి .. పెద్ద విజయాన్ని అందుకున్న సినిమాల జాబితాలో, 'ఆనందో బ్రహ్మ' స్థానం సంపాదించుకుందని చెబుతున్నారు.    
tapsee

More Telugu News