మెగాస్టార్ 'సైరా'... లీకైన డైలాగులు ఇవి!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మెగాస్టార్ 'సైరా'... లీకైన డైలాగులు ఇవి!

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రంగా 'సైరా' (ట్యాగ్ లైన్ నరసింహారెడ్డి) మొదలైన సంగతి తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఏకంగా రూ. 150 కోట్లతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, ఈ చిత్రంలోని డైలాగులంటూ కొన్ని డైలాగులు నెట్టింట లీకయ్యాయి. 'ఒరేయ్ నేను ఒట్టి చేతులతో వచ్చా, నువ్వు భుజం మీద తుపాకీతో వచ్చావ్.. అయినా నా చెయ్యి మీసం మీదకి పోయే సరికి నీ బట్టలు తడిసిపోతున్నాయిరా' అన్న డైలాగ్ మెగా అభిమానులకు తెగ నచ్చేయడంతో శరవేగంగా షేర్ మీద షేర్ తెచ్చుకుంటూ హల్ చల్ చేస్తోంది. ఇక డైలాగ్ లీక్ పై చిత్ర యూనిట్ ఇంతవరకూ స్పందించలేదు. ఇక ఈ డైలాగ్ అధికారికమైనా, అనధికారికమైనా, క్యాచీగా, బాగా ఉండటంతో ఫ్యాన్స్ సైతం ఎంజాయ్ చేస్తున్నారు.

More Telugu News