ఆ క్లిప్పింగ్స్ చూసి, వావ్ అనకుండా ఉండలేకపోయాను: చిరంజీవి
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, ఈ సినిమాకి సంబంధించిన కొన్ని క్లిప్పింగ్స్ ను చూసిన తాను 'వావ్' అనకుండా ఉండలేకపోయానని అన్నారు. దైవం .. దెయ్యం .. మనిషి .. ఈ ముగ్గురి మధ్య జరిగే ఘర్షణగా ఈ సినిమా తెరకెక్కిందని చెప్పారు. సోషియో ఫాంటసీగా రూపొందిన ఈ సినిమా మరో వైపు చూపు మరల్చకుండా చేసిందని అన్నారు. దర్శకుడు అద్భుతమైన ప్రతిభను చూపాడనీ, నటీనటుల నటన ఆకట్టుకునేదిలా ఉందని చెప్పారు. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.