Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మరణశిక్ష విషయంలో రూటు మార్చిన ఫ్లోరిడా.. కొత్త లెథల్ ఇంజెక్షన్ ద్వారా శిక్ష అమలు!

మరణశిక్షల విషయంలో అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం రూటు మార్చింది. తొలిసారిగా మూడు రకాల మందుల సమ్మేళనంతో కూడిన లెథల్ ఇంజక్షన్ ద్వారా గురువారం ఓ దోషికి మరణశిక్షను అమలు చేసింది. ఇద్దరు నల్లజాతీయులను హత్య చేసిన కేసులో శ్వేత జాతీయుడైన మార్క్ జేమ్స్ ఎస్సే (53)పై మోపిన నేరారోపణలు రుజువు కావడంతో కోర్టు అతడికి మరణశిక్ష విధించింది. దోషికి ఈ ఇంజక్షన్ ఇచ్చిన వెంటనే అతని పాదాలు కొట్టుకున్నాయి... ఆ వెంటనే అతని నోరు తెరచుకుంది.. క్షణాలలో అతని ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.

More Telugu News