పాలకొల్లులో 54 అడుగుల మహా గణపతి.. విశేషంగా ఆకట్టుకుంటున్న లంబోదరుడు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పాలకొల్లులో 54 అడుగుల మహా గణపతి.. విశేషంగా ఆకట్టుకుంటున్న లంబోదరుడు!

పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లులో మహా గణపతి కొలువుదీరాడు. రెల్లి యువజన సేన ఆధ్వర్యంలో 54 అడుగుల మట్టి విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు సర్వం సిద్ధం చేశారు. నిలుచుని ఉన్న ఈ విగ్రహానికి ఓ వైపు శివుడు మరోవైపు పార్వతీదేవి తలలు ఉన్నాయి. తొమ్మిది రోజుల పూజల అనంతరం  అదే ప్రాంతంలోని కాలువల నీళ్లను వెదజల్లి నిమజ్జనం చేయనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. 54 అడుగులు ఉన్న ఈ మహా గణపతి విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

More Telugu News