Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఈ పరిస్థితుల్లో నితిన్ ఆ మూవీ చేస్తాడా?

'అ ఆ' సినిమా తరువాత ఆ స్థాయి హిట్ కొట్టాలనే ఉద్దేశంతో కొంత గ్యాప్ ఇచ్చి మరీ నితిన్ 'లై' కథను ఎంచుకున్నాడు. అయితే ఈ సినిమాపై నితిన్ పెట్టుకున్న ఆశలు నీరుకారిపోయాయి. దాంతో నితిన్ డీలాపడిపోయాడు. అలాంటి నితిన్ .. సంపత్ నందితో ఒక సినిమా చేయనున్నట్టు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.

 సంపత్ నంది 'గౌతమ్ నంద' కథను ముందుగా నితిన్ కే వినిపించాడట. ఆ కథకి తాను సరిపోనని చెప్పిన నితిన్ .. మరో ప్రాజెక్టును కలిసి చేద్దామని సంపత్ నందితో అన్నాడట. అయితే సంపత్ నంది తెరకెక్కించిన 'గౌతమ్ నంద' కూడా పరాజయాన్ని మిగిల్చింది. దాంతో తన తదుపరి సినిమాను నితిన్ తో చేయడానికి ఆయన రెడీ అవుతున్నాడని అంటున్నారు. భారీ ప్లాప్ రుచి చూసిన నితిన్ .. ఆల్రెడీ ప్లాప్ ఇచ్చిన సంపత్ నందితో కలిసి సినిమా చేస్తాడా? అనేదే సందేహం. చూడాలి మరి ఏం జరుగుతుందో! 
nitin
sampath nandi

More Telugu News