: చుంకీ పాండేకు ఇంత అందమైన కూతురా? : కొరియోగ్రాఫర్ ఫరాఖాన్ మితిమీరిన వ్యాఖ్యలు
బాలీవుడ్ సీనియర్ నటుడు చుంకీపాండే కూతురు అనన్యపాండే ఫొటో చూసిన ఫ్రముఖ కొరియోగ్రాఫర్ ఫరాఖాన్ మితిమీరిన వ్యాఖ్యలు చేశారు. చుంకీపాండే భార్య భావనా పాండే తన ఇన్ స్టా గ్రామ్ ఖాతా ద్వారా తమ కూతురు అనన్య ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో ఎంతో అందంగా ఉన్న అనన్యను చూసి నెటిజన్లు పలు ప్రశంసలు కురిపించారు.
అయితే, ఫరాఖాన్ మాత్రం కొంచెం శ్రుతి మించిన కామెంట్స్ చేశారు. ‘చుంకీ పాండే కూతురికి ఉండాల్సిన అందం కంటే మరింత అందంగా ఆమె ఉంది. ప్లీజ్.. డీఎన్ ఏ టెస్ట్ చేయించండి’ అంటూ వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. చుంకీ పాండే కుర్రాడిగా ఉన్నప్పుడు చాలా అందంగా ఉండేవాడని, అనన్య ఆయన కూతురే అని చెప్పడానికి ఎటువంటి పరీక్షలు అవసరం లేదంటూ ఫరాఖాన్ ను ఉద్దేశించి ఓ నెటిజన్ ఘాటు వ్యాఖ్య చేశారు.