: అన్నా డీఎంకే రాజకీయం: తమిళనాట క్షణక్షణానికి పెరుగుతున్న ఉత్కంఠ!


తమిళనాడులో క్షణక్షణానికి ఉత్కంఠ పెరుగుతోంది. అన్నాడీఎంకేలో కూడికలు తీసివేతలు నేడు ఒక కొలిక్కి రానున్నట్టు తెలుస్తోంది. కాసేపట్లో తమిళనాడు ఇన్ ఛార్జీ గవర్నర్ విద్యాసాగరరావు ముంబై నుంచి చెన్నై చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో నేటి మధ్యాహ్నం 12 గంటలకు పళని స్వామి, పన్నీరు సెల్వం వర్గాలు సమావేశం ఏర్పాటు చేయనున్నాయి. ఈ సమావేశం అనంతరం విలీన ప్రకటన చేయనున్నారు.

ఈ సందర్భంగా పన్నీరు సెల్వం వర్గంలోని ఇద్దరు నేతలకు మంత్రి పదవులు ఇవ్వనున్నారని తెలుస్తోంది. మధ్యాహ్నం 2 గంటలకు శశికళ వర్గంతో దినకరన్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాట ఏం జరుగనుందనే ఉత్కంఠ పెరుగుతోంది. అన్నాడీఎంకేలో చోటుచేసుకున్న ఈ పరిణామాలన్నీ డీఎంకే ఆసక్తిగా గమనిస్తోంది. 

  • Loading...

More Telugu News